telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పోరాటం చేస్తున్న రైతులకు ఢిల్లీ ప్రజలు సాయం చేయాలి ; కేజ్రీవాల్

arvind-kejriwal

రైతుల ఆందోళనల్లో వేల సంఖ్యలో రైతులు పాల్గొంటున్నారు.. వందలాది ట్రాక్టర్లతో రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరుకున్న అన్నదాతలు.. ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. అయితే, ఆందోళనల్లో పాల్గొంటున్న రైతాంగానికి తోచిన సాయం చేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. మరోవైపు.. రైతుల డిమాండ్లపై స్పందించి.. సాధ్యమైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం వారితో చర్చలు జరపాలని కోరారు. చలికి సైతం వెనకడుగు వేయకుండా ఆందోళన చేస్తున్న అన్నదాతలకు.. ఆప్ ఎమ్మెల్యేలు, వాలంటీర్లు సాయం చేస్తున్నారని.. ప్రజలు కూడా తమకు తోచిన సాయం చేయాలని కోరారు ఢిల్లీ సీఎం. ఓ వీడియో సందేశాన్ని ట్విట్టర్‌లో పెట్టిన సీఎం కేజ్రీవాల్.. కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా రైతులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను అంగీకరిస్తుందని ఆశిస్తున్నాను.. చలిని సైతం లెక్కచేయకుండా రైతులు ఆందోళన చేస్తున్నారు.. ఇప్పటికే వారికి ఆహారం, వైద్యం, తాగునీరు సహా ఆప్ వాలంటీర్లు, ఎమ్మెల్యే తమకు సాధ్యమైన సాయం చేస్తున్నారని.. పోరాటం చేస్తున్న రైతులకు ఢిల్లీ ప్రజలంతా సాయం చేసి అదుకోవాలని విజ్ఞప్తి చేశారు.. కాగా, ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి… 1949 నవంబర్‌లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలను సైతం క్రాస్ చేసి కొత్త రికార్డు సృష్టించింది.

Related posts