telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ సీఎం పై జేపీ నేత లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు…

బీజేపీ పార్టీ సీనియర్ నేత కె లక్ష్మణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.  బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు.  తిరుపతి ఉప ఎన్నిక రాష్ట్ర ప్రజల భవిష్యత్ తో ముడిపడి ఉందని అన్నారు.  సీఎం రెండేళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారని, అవినీతి, దోపిడీ, పెత్తందారీ వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చేశారని తెలిపారు. హిందువుల మనోభావాలు గాయపడేలా తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇసుక మాఫియా, భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు.  భూ ఆక్రమణలు, ఇసుక మాఫియా ద్వారా వచ్చిన డబ్బును ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు ఉపయోగిస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు.  టీడీపీపై కూడా అయన విమర్శలు గుప్పించారు.  చంద్రబాబు అస్త్రసన్యాసం చేసారని, భవిష్యత్తులో ఆ పార్టీ మనుగడ ప్రశ్నర్ధకంగా మారిందని అన్నారు.  వైకాపా అక్రమాలను ఎదుర్కోవడం బీజేపీతోనే సాధ్యం అని, సబ్ కా సాత్ , సబ్ కా వికాస్ నినాదంతో ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని అన్నారు.  ఎంపీగా బీజేపీ అభ్యర్థి రత్నప్రభను గెలిపిస్తే మోడీ ప్రతినిధిగా రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తారని తెలిపారు.

Related posts