telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం!

spit open places

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

బహిరంగ ప్రదేశాలు, సంస్థలు, కార్యాలయాలు, రోడ్లపై పాన్, గుట్కాను నమిలి ఉమ్మివేయడంపై విధించిన నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఉమ్మివేయడం, శుభ్రత లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉందని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రజారోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించినట్టు తెలిపారు.

Related posts