పుల్వామా ఘటనతో ప్రతి చిన్న విషయానికి ప్రజలు, అధికారులు ఆందోళన పడాల్సి వస్తుంది. ఎక్కడ ఏ చిన్న సమస్య అని తెలిసినా తీవ్రంగా ఆందోళనకు గురి కావాల్సి వస్తుంది. ఇదే సందర్భంగా ఆకతాయిలు కూడా తమ వినోదం కోసం తప్పుడు వార్తలను ప్రచారం చేయడంతో అధికారులకు ఇంకా పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. ఒక వార్త ఇండియా-పాక్ మధ్య యుద్ధం వస్తుంది.. అంటూంటే మరో వార్త హైజాక్ అంటూ వస్తుంది. దీనితో అవి నిజమో, ఆకతాయి పనో తెలిసేదాకా అధికారులు రక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే తాజాగా, గన్నవరం విమానాశ్రయంలో విమానం హైజాక్ కలకలం రేగింది. గన్నవరం విమానాశ్రయంలో ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేయబోతున్నామనీ… దానిని పాకిస్తాన్‌కు తరలిస్తామని ఓ గుర్తు తెలియని వ్యక్తి ముంబైలోని ఎయిరిండియా కంట్రోల్ సెంటర్‌కు ఫోన్ చేశాడు.
దీనితో అప్రమత్తమైన అధికారులు ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని ముఖ్యమైన విమానాశ్రయాల దగ్గరా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో అదనపు బలగాలను మోహరించడంతో పాటు లగేజ్, ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతిస్తున్నారు. మరోవైపు ఈ బెదిరింపు కాల్ ఆకతాయి పనిగా పోలీసులు భావిస్తున్నారు.
గమనిక : దయచేసి పుల్వామా ఘటన ను ఆకతాయిగా తీసుకోని, తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు. ఇప్పటికే ప్రజలు ఆందోళనలో ఉన్నారు. గమనించి ప్రవర్తించగలరు.