telugu navyamedia
సినిమా వార్తలు

అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన అనుపమ

Anupama-Parameshwaran

మ‌ల‌యాళ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తెలుగులో స్లో అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది. ఆస‌క్తిక‌ర‌మైన విషయం ఏంటంటే అనుప‌మ అసిస్టెంట్ డైరెక్టర్ గా సరికొత్త అవ‌తారమెత్తింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు హీరోయిన్‌గా దుల్క‌ర్ స‌ల్మాన్‌తో క‌లిసి సినిమా చేస్తుంది. సాధార‌ణంగా హీరోయిన్స్ స‌న్నివేశాల్లో న‌టించి షాట్ గ్యాప్‌లో రెస్ట్ తీసుకుంటారు. కానీ అందుకు అనుపమ మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఖాళీగా కూర్చోకుండా ద‌ర్శ‌కుడ్ని క‌లిసి తాను ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేస్తాన‌ని కోరిందట. ద‌ర్శ‌కుడు కూడా స‌రేన‌ని ఆమెకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా చేయాల్సిన కొన్ని ప‌నుల‌ను సూచించాడ‌ట‌. మ‌న రెమ్యున‌రేష‌న్ మ‌న‌కొస్తే చాలని అనుకొనే ఈ రోజుల్లో అనుపమ ఇలా చిత్రబృందానికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా మారి త‌న వంతు స‌పోర్ట్ అందించడం విశేషం.

Related posts