telugu navyamedia
సినిమా వార్తలు

ఫోన్‌లు పగలకొట్టండిరా..-ఫ్యాన్స్‌పై మండిప‌డ్డ సింగర్‌ మంగ్లీ

తనతో ఫోటో  తీసుకోవడానికి ఎగబడ్డ అభిమానులపై ఆగ్రహంతో ఊగిపోయింది సింగ‌ర్‌ మంగ్లీ… ఫోన్లు పగలగొట్టండి అంటూ నోటికొచ్చింది తిట్టేసింది. 

జానపద పాటలతో కెరీర్‌ ప్రారంభించిన మంగ్లీ.. తన పాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటుంది. ఇటీవల కాలంలో స్టార్‌ హీరోల సినిమాల్లో సైతం మంగ్లీ పాట ఉండాల్సిందే..

Meet Telangana singer 'Mangli' whose song on YouTube garnered 2.5 million views in two days- The New Indian Express

దీంతో సింగర్ మంగ్లీ ఇప్పుడు ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతోన్నారు.. ఆమె ఎలాంటి పాట పాడినా కూడా నెట్టింట్లో వైరల్ అవుతుడ‌డంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది. 

అయితే తాజాగా ఒంగోలులోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆమెకు సెల్ఫీల సెగ తగిలింది. ప్రోగ్రామ్‌ అనంతరం తిరిగి వెళ్తుండగా మంగ్లీతో ఫోటోలు దిగేందుకు కొందరు యువకులు ఎగబడ్డారు.సెల్ఫీల కోసం ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అసహనానికి గురైన మంగ్లీ.. యువకుల తీరుతో ఇబ్బంది పడింది.

ఫోన్లు పగలగొట్టండి అంటూ తిట్టేసింది. ఆఖరికి తన అసిస్టెంట్ పై కూడా మంగ్లీ కోపగించుకుంది. వెంటనే బండికి ఫోన్ చెయ్ రా దరిద్రుడా.. అంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం మంగ్లీ ఫైర్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Pushpa Item Song Oo Anthiya Singer Mangli Mobbed in Ongole

కాగా అల్లు అర్జున్ న‌టించిన‌ పుష్ప సినిమాలో ఊ అంటావా మావ..ఊఊ అంటూవా అనే పాటను మంగ్లీ కన్నడ వెర్షన్‌లో పాడి అంద‌రినీ ఆకట్టుకుంది.

Related posts