telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇళయదళపతి అభిమానులకు నిరాశ… విజయ్ తనయుడికి నటనలో ఇంట్రెస్ట్ లేదట…!

Vijay

తమిళంలో ఇళయదళపతి విజయ్ వరస హిట్లతో బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాస్తునాడు. అయితే విజయ్ తో పాటు ఇపుడు విజయ్ తనయుడు జేసన్ సంజయ్ రీసెంట్ గా ఒక షార్ట్ ఫిలింను డైరెక్ట్ చేసి అందులో హీరోగా నటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆరు నిముషాల యాభై ఒక సెకన్ల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిలిం టైటిల్ ‘జంక్షన్’. అయితే విజయ్ కొడుకు కూడా హీరో అవుతాడని విజయ్ స్థానాన్ని జేసన్ భర్తీ చేస్తాడని అభిమానులు అనుకున్నారు. విజయ్ తనయుడు జాసన్ మాత్రం నటనపై ఆసక్తిని కనబర్చడం లేదట. ఆయనకు ఎక్కువగా దర్శకత్వంపై ఆసక్తి ఉంటుందని నిర్మాత జేవియర్ బ్రిట్టో అన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జేవియర్ మాట్లాడుతూ.. విజయ్ తనయుడు జాసన్ ఎంట్రీ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అతడికి మాత్రం నటనపై ఆసక్తి ఉన్నట్లుగా అనిపించడం లేదు. ప్రస్తుతం కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సును చేస్తున్నాడు. అందులో భాగంగా అతడు దర్శకత్వంపై మెలకువలు నేర్చుకోవడంతో పాటు హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్ తో పని చేస్తున్నాడు. ప్రస్తుతానికి జాసన్ దృష్టి అంతా కూడా దర్శకత్వంపైనే ఉందని ఆయన అన్నాడు.

Related posts