telugu navyamedia
సినిమా వార్తలు

యువ నటి న్యూడ్ ఫోటోలు లీక్… పోలీసులకు ఫిర్యాదు

juli

ఇప్పుడిప్పుడే చిన్న సినిమాలు చేసుకుంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న మలయాళ హీరోయిన్ జుహి రస్తోగికి చేదు అనుభవం ఎదురైంది. తన పేరుతో కొందరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇష్టమొచ్చినట్లు ఫోటోలు పోస్ట్ చేస్తున్నారని చెబుతుంది ఈమె. అంతేకాదు.. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ ఫోటోలు తనవి కావని.. అన్నీ మార్ఫింగ్ చేసి వదిలినవే అని క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోలు.. వీడియోలు అశ్లీలంగా.. అసభ్యంగా ప్రచారం చేస్తున్నారనే విషయం తన దృష్టికి రాగానే వెంటనే అప్రమత్తమయ్యానని చెబుతుంది జూహి. ఇదే విషయం కేరళ పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లింది జుహి. అక్కడ ఎర్నాకులం సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈమె. తన ఫోటోలను మార్పింగ్ చేసి ప్రచారం చేస్తున్న కొన్ని అకౌంట్స్ వివరాలను తన అభిమానుల సాయంతో పట్టుకుని పోలీసులకు ఇచ్చింది జుహి. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts