telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో సాంగ్ రిలీజ్ – ఫ్యాన్స్​కు పునాకాలు

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుథిరం) . ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిస్తున్నారు.

దాదాపు రూ.450 కోట్లతో నిర్మించిన ఈ భారీ బడ్జెట్​ సినిమాలో తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఇప్ప‌టికే వీడుదలైన పోస్ట‌ర్స్‌, గ్లింప్స్‌, ట్రైలర్, సాంగ్స్ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.

Ramam Raghavam Song From RRR Movie Is All About Ram Charan Alluri Sita  Ramaraju's Characterisation

ఇటీవల ఎన్టీఆర్ కొమరం భీం పాత్రకు సంబంధించిన ‘కొమరం భీముడో’ సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ అభిమానులకు గూస్ బంప్స్ వ‌చ్చాయి. దాంతో అంచ‌నాలు మ‌రింత పెంచేశాయి.

తాజాగా న్యూ ఇయర్ సంద‌ర్భంగా  రైజ్ ఆఫ్ రామ్ కొత్త పాట రిలీజ్ చేసింది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్… ‘రామం రాఘవం… రణధీరం రాజసం’’ అంటూ సాగే లిరిక్స్.. ఫ్యాన్స్​కు పునాకాలు తెప్పిస్తున్నాయి.

చరణ్ పోషిస్తున్న రామ్ క్యారెక్టర్ ను తెలియచేస్తూ సాగే ఈ పాటను శివశక్తి దత్తా సంస్కృతంలో రాయడం విశేషం. ఈ పాటను విజయ్ ప్రకాశ్‌, చందన బాల కళ్యాణ్, చారు హరిహరన్ పాడారు.  ఈ పాట సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇందులో అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుద‌ల చేయ‌నున్నారు. 

Related posts