telugu navyamedia
సినిమా వార్తలు

“వ‌జ్ర క‌వ‌చ‌ర‌ధ‌ర గోవింద‌” ట్రైలర్

Sapthagiri

కమెడీయ‌న్ నుండి హీరోగా ట‌ర్న్ అయిన సప్తగిరి మూడేళ్ల క్రితం “సప్తగిరి ఎక్స్‌ప్రెస్” సినిమాతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. ఆ త‌రువాత‌ 2017లో “సప్తగిరి ఎల్ఎల్‌బి” అనే సినిమాలో కూడా హీరోగా నటించారు. తాజాగా త‌ను హీరోగా మూడో సినిమా “వ‌జ్ర క‌వ‌చ‌ర‌ధ‌ర గోవింద‌” అనే చిత్రం చేస్తున్నాడు. అరుణ్ ప‌వార్ ద‌ర్శకత్వం వ‌హిస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 14న విడుదల కాబోతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో స‌ప్త‌గిరి కామెడీ టైమింగ్ బాగుంది. ట్రైల‌ర్ చివరిలో రజినీకాంత్ స్టైల్లో సప్తగిరి చెప్పే డైలాగ్ హైలైట్. “ఇదే లాస్ట్ సిగరెట్టు, ఇదే లాస్ట్ పెగ్గు అన్న మగాడి మాట.. ఇదే లాస్ట్ షాపింగ్ అన్న ఆడవాళ్ల మాట జనాలు నమ్మినట్టు చరిత్రలోనే లేదు” అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ ట్రైల‌ర్ పై ఓ లుక్కేయండి మరి.

Related posts