telugu navyamedia
సినిమా వార్తలు

ఎన్టీఆర్ పై డామినేషన్ కామెంట్స్‌.. చ‌ర‌ణ్ రిఫ్లై…

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా నటించిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం​ దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టింది.

కొమురం భీంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతరామారాజుగా రామ్‌ చరణ్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఈ పాత్ర‌ల్లో ఎన్టీఆర్‌ కంటే రామ్‌చరణ్‌ పాత్రను ఎలివేట్‌ చేశారని, దీంతో తారక్‌ కంటే చరణ్‌ పాత్ర డామినేటింగ్‌గా ఉందంటూ పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు.

తాజాగా ముంబైలో గత రాత్రి పెన్ స్టూడియోస్ ఏర్పాటు చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ సక్సెస్‌ మీట్‌లో ఇదే అంశంపై ఓ జర్నలిస్ట్‌ ప్రశ్నించింది. ఎన్టీఆర్‌ కంటే చరణ్‌ ఎక్కువ మార్కులు కొట్టేశాడని అంటున్నారు అని అడగ్గా.. వెంటనే చరణ్ స్పందిస్తూ “అది నిజం కాదు. డామినేషన్‌ అన్న పదాన్ని నేను అస్సలు నమ్మను. మేమిద్దరం చాలా బాగా చేశాము. తారక్ అద్భుతంగా నటించాడు.

RRR suceess meet

నా కెరీర్‌లో మరే ఇతర సినిమాలో పని చేయడాన్ని నేను ఇంతగా ఆస్వాదించలేదు. తారక్‌తో కలిసి పనిచేయడం ఎంజాయ్ చేశాను. ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం అతడితో చేసిన ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. ఈ అవకాశం ఇచ్చినందుకు రాజమౌళి గారికి ధన్యవాదాలు’ అని చరణ్‌ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch: Ram Charan comes to aid of Jr NTR when journalist asks him a tough  question | Telugu Movie News - Times of India

Related posts