telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చీరలో మెరిసిన సన్నీలియోన్

శ‌ృంగార తార సన్నీలియోన్ ఐటమ్ సాంగ్‌లతో, కైపెక్కించే చూపులతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన మధురానుభూతులను షేర్ చేసుకుంటున్న ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో 4.2 కోట్ల మంది ఫాలోయర్లను సంపాదించుకుంది. సన్నీలియోన్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సమయంలో వరుసగా విమర్శలు ఎదురయ్యాయి. ఆ విమర్శలకు కుంగిపోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ క్రేజీ సెలెబ్రిటీగా మారిపోయింది. ప్రస్తుతం సన్నీలియోన్ కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాక సౌత్ చిత్రాలలో కూడా నటిస్తోంది.  ఆమె బాలీవుడ్ సినిమాల్లో ఎన్నో స్పెషల్ సాంగ్స్‌లో నటించి మంచి ప్రజాదరణ పొందారు. అయితే ఇటీవల ఆమె తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అంతగా ఏముందనుకుంటున్నారు. పక్కా కేరళ సాంప్రదాయ దుస్తుల్లో సన్ని లియోన్, ఆమె కుటుంబం కనిపించారు. చక్కని చీర కట్టుతో సన్ని లియోన్, అలాగే పంచె కట్టుతో ఆమె భర్త డానియల్ అందరి దృష్టి ఆకర్షించారు. తమ పిల్లలు నిషా కౌర్, ఆషెర్, నొఆహ్‌లు కూడా కేరళ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. వారంతా కేరళ సాంప్రదాయ వంటకాలను రుచిని ఎంతో ఎంజాయ్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

Related posts