telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘సీటీమార్’ మాస్ సాంగ్ లో ఇరగదీసిన ఆర్జీవీ భామ!

మాస్ హీరో గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్’. మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో ‘గౌతమ్ నంద’ తర్వాత గోపిచంద్, సంపత్ నంది కలయికలో వస్తున్న చిత్రమిది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భూమిక, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశి న‌టిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అయితే  ఆదివారం ఈ సినిమా నుంచి ఐటమ్ సాంగ్ రిలీజ్ అయింది. మణిశర్మ సంగీత దర్శకత్వంలో పూర్తి స్థాయి మాస్ నెంబర్ గా ఆకట్టుకుంటోంది. అప్సరా రాణిపై చిత్రీకరించిన ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ నృత్యరీతుల్ని సమకూర్చారు. ‘నా పేరే పెప్సీ ఆంటీ… నా పెళ్ళికి నేనే యాంటీ…’ అంటూ సాగే ఈ పాటను సంపత్ నంది రాశారు. కీర్తన శర్మ హస్కీ వాయిస్ శ్రోతల్ని ఆకట్టుకునేలా సాగింది. 

Related posts