*ముగిసిన ఏపీ కేబినేట్ భేటి
*ఏపీ సీఎంకు రాజీనామా లేఖలు అందించిన 24 మంది మంత్రులు
*డిగ్రీ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
*ఈ రాత్రికే గవర్నర్ ఆమోదించే అవకాశం
*ఈ నెల 11న కొత్త మంత్రివర్గ విస్తరణ
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ కు మంత్రులంతా రాజీనామా పత్రాలు సమర్పించారు. ఈ మేరకు గవర్నర్ హరిచందన్‌కు మంత్రుల రాజీనామాలను సీఎం జగన్ పంపనున్నారు. ఈ రాత్రికే మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించనున్నారు.
ఈ భేటీలో 36 అంశాలపై కేబినెట్ చర్చించింది. ఈ సమావేశంలో మిల్లెట్ మిషన్ పాలసీ, డిగ్రీ కాలేజీల్లో 574 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ వంటి తదితర ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
చివరి కేబినెట్ భేటీలో .. కొత్తగా కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ విజయవంతంగా చేసినందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ కి అభినందనలు తెలిపారు. అభినందనలు తెలుపుతూ క్యాబినెట్ తీర్మానం చేసింది. దీనితోపాటు మిలెట్ పాలసీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
అలాగే ఈనెల 10న కొత్త మంత్రుల జాబితాను గవర్నర్ కు సీఎం జగన్ పంపనున్నారు. ఈనెల 11న కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంత్రుల్లో ఐదు, ఆరుగురికి తిరిగి అవకాశం లభించే అవకాశం ఉంటుందని సమాచారం.