telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధమైన మరో హీరోయిన్

Megha-Akash

ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక వెబ్ సిరీస్ లకు ఓకే చెప్పిన హీరోయిన్స్ లో నితిన్ హీరోయిన్ మేఘ ఆకాష్ కూడా చేరింది. తమిళంలో ప్రముఖ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో రూపొందబోతున్న వెబ్ సిరీస్ లో కీలక పాత్రను మేఘ ఆకాష్ పోషించబోతుంది. ఈ అమ్మడు తెలుగు తమిళ్ లో సినిమాలు చేసిన అవి ఫట్ అయ్యాయి దాంతో వెబ్ సిరీస్ లలోకి అడుగు పెడుతుంది. అక్కడైనా అమ్మడి దశ తిరుగుతుందేమో చూడాలి. ఇక ఇప్పుడు హీరోయిన్లకు అవకాశాలు తగ్గితే ప్రత్యామ్నాయ మార్గంగా అందుబాటులోకి వచ్చింది. హీరోయిన్లంతా ఇప్పుడు ఈ దిశగా అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నారు. సినిమా అవకాశాలు తగ్గిన మరుక్షణం, వెబ్ సిరీస్ కు కాల్షీట్లు కేటాయిస్తున్నారు. ఈ లిస్ట్ లోకి సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరారు.

Related posts