telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

యుద్ధ సన్నాహాలలో పాకిస్తాన్.. ఎయిర్ పోర్టుల మూసివేత.. యుద్ధ ట్యాంకుల తరలింపు.. !

300 Killed Jets Strike Terror Camp

భారతదేశం పుల్వామా కు ప్రతీకారంగా ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఉగ్రమూకలపై దాడి చేసిన విషయం తెలిసిందే. దానికి ప్రతీకారంగా పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం భారత్ లోకి చొచ్చుకు రావటంతో ఆర్మీ ఒక విమానాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే. భారత భూభాగంలోకి రావడంతో కాల్పులు జరపగా, దెబ్బతిన్న పాక్ విమానం నియంత్రణ రేఖ(ఎల్వోసీ)కి 3 కిలోమీటర్ల దూరంలో వారి భూభాగంలోనే కూలిపోయిందని తెలుస్తుంది. అయితే పాక్ మాత్రం యుద్దానికి కారణాలు వెతుక్కుంటున్నట్టుగా, తమ విమానాలు రెండిటిపై భారత్ దాడికి దిగిందని ప్రచారం చేసుకోవడం విశేషం. ఇలా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పాక్ గుట్టుచప్పుడు కాకుండా ఆయుధాలు, సైన్యాన్ని సరిహద్దు వైపునకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తమ యుద్ధ ట్యాంకులను పంజాబ్ లోని సియాల్ కోట్ కు రహస్యంగా తరలిస్తోంది.

ఈ విషయమై పాకిస్థాన్ అధికారిక ప్రకటన చేయనప్పటికీ, స్థానికులు యుద్ధ ట్యాంకుల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దుచేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. లాహోర్, ఇస్లామాబాద్, ఫైసలాబాద్, ముల్తాన్, సియాల్ కోట్ ఎయిర్ పోర్టుల నుంచి రాకపోకలను పూర్తిగా ఆపేస్తున్నట్లు వెల్లడించింది.

అంతేకాకుండా గగనతలాన్ని మూసివేస్తున్నామని చెప్పింది. ఇక భారత్, పాకిస్థాన్ ల మధ్య రాకపోకలు సాగిస్తున్న విమాన సర్వీసులపై కూడా ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఇరుదేశాల మధ్య తిరుగుతున్న విమానాలు తమ సొంత దేశాలకు చేరుకున్నాయి. ఇక భారత్ లో కూడా సరిహద్దులలో విమాన సేవలు నిలిపివేశారు. స్థానిక గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. సరిహద్దులలో కాల్పులతో మార్మోగిపోతున్నట్టు సమాచారం. దీనితో యుద్ధఛాయలు అలముకుంటాయనే వార్తలు సామజిక మాధ్యమాలలో హాల్ చల్ చేస్తున్నాయి.

Related posts