telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మందుబాబులకు దిమ్మతిరిగే షాక్…

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు వేడేక్కుతున్నాయి. ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ పార్టీ అయితే.. ఏకంగా కేంద్రమంత్రులనే రంగంలోకి దించుతోంది.  అటు టీఆర్ఎస్ కూడా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇది ఇలా ఉండగా… తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 14న జరుగనున్నాయి. మహబూబునగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ పరిధిలో లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గం పరిధిలో ఈ నెల 12వ తేదీ సా. 4 గంటల నుంచి 14 వ తేదీ వరకు వైన్ షాపులు బంద్ చేయాలనీ సైబరాబాద్ సీపీ వీసి సజ్జనర్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు కల్లు దుకాణాలు, బార్లు, రెస్ట్రారెంట్లు, పబ్బులు, బార్లు ఆ రోజుల్లో మూతపడునున్నాయి. ఈ నిర్ణయంతో మందుబాబులు షాక్ తిన్నారు.

Related posts