telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

మేము శాంతినే కోరుకుంటున్నాం.. మా బలం చూపడానికే భారత విమానాలను కూల్చేశాం .. ఇక చాలు.. !!

Surgical Strike 2Pakistan Indian air space

నేడు తమ గగన స్థలంలోకి వచ్చిన రెండు భారత విమానాలను కూల్చామని చెబుతున్న పాకిస్తాన్ దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మాట్లాడిన పాక్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తమ సామర్థ్యం చూపించడానికే భారత విమానాలు కూల్చాం అని చెప్పారు. పాక్ యుద్ధం కోరుకోవడం లేదని, రెండు దేశాల మధ్య శాంతి కోరుకుంటోందని తెలిపారు.

ఉదయం నుంచీ లైనాఫ్ కంట్రోల్ దగ్గర కొన్ని యాక్టివిటీస్ జరిగాయి. నియంత్రణ రేఖ దాటి వచ్చిన ఆరు టార్గెట్లను పాక్ సైన్యం ఎంగేజ్ చేసింది. కొన్ని రోజుల క్రితం భారత్ మనపై దాడి చేశామని చెప్పింది. సరిహద్దు దాటి వచ్చి టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేశామని, 300 మందిని చంపామని చెప్పింది. పాకిస్తాన్ ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్‌కు దానికి సమాధానం ఇవ్వడం తప్ప వేరే దారి లేకుండాపోయింది. వాళ్లలాగే బదులివ్వాలా, లేక ఒక బాధ్యతాయుతమైన దేశంలా జవాబు ఇవ్వాలా అని ఆలోచించాం.

సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోడానికి పాక్ సైన్యానికి తగిన సామర్థ్యం ఉంది. మాకు ప్రజల మద్దతు కూడా ఉంది. ఒక బాధ్యతాయుతమైన దేశంగా మేం శాంతి కోరుకుంటున్నాం. మేం భారత్ విమానాలను కూల్చాలని నిర్ణయించుకున్నప్పుడు పౌరులకు, వేరే ఎలాంటి నష్టం జరగకూడదని భావించాం. పరిధి లోపల ఆరు టార్గెట్లు సెలక్ట్ చేసి, లాక్ చేశాం. తర్వాత కాసేపట్లోనే బహిరంగ ప్రాంతాల్లో స్ట్రయిక్స్ చేశాం. మా సామర్థ్యం చూపించడానికే ఈ దాడులు చేశాం. పాకిస్తాన్ దగ్గర సామర్థ్యం ఉంది. కానీ మేం బాధ్యతాయుతంగా ఉండాలని భావిస్తున్నాం. మేం యుద్దం, ఉద్రిక్త పరిస్థితులు కోరుకోవడం లేదు. మా ప్రధాని శాంతి కోరుకుంటున్నారు. మేం పరిస్థితులను యుద్ధం వైపు తీసుకెళ్లకూడదని భావిస్తున్నాం.

దాడి వీడియోను కూడా కాసేపట్లో షేర్ చేస్తాం. రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ విమానాలు లైనాఫ్ కంట్రోల్ దాటి పాకిస్తాన్‌లోకి వచ్చాయి. వాటిని పాక్ ఎయిర్ ఫోర్స్ టేకాన్ చేశాయి. రెండింటినీ షూట్ డౌన్ చేశాయి. ఒకటి పాకిస్తాన్ రేంజ్‌లో, ఇంకొకటి భారత్ రేంజ్‌లో పడ్డాయి. పైలెట్లు ఇద్దరినీ మా సైన్యం అరెస్ట్ చేసింది. వారితో ఒక దేశం ఎలా ప్రవర్తిస్తుందో అలాగే ప్రవర్తించాం. తీవ్రంగా గాయపడ్డ ఒక పైలెట్‌ను సీఎంఎస్‌లో చేర్పించాం. ఇంకొకరు మా అదుపులో ఉన్నారు. మాకు పైలెట్ల దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్లు కూడా లభించాయి. అటు భారత్ పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 విమానాలను కూల్చాం అని చెబుతోంది. కానీ మేం వాటిని అసలు ఉపయోగించలేదు. పాక్ విమానం కూలినట్లు కూడా మాకు ఎలాంటి సమాచారం రాలేదు. ఇక ముందు ఏం చేస్తామో కూడా మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ చెప్పారు.

పాక్ ప్రభుత్వం, పాక్ సైన్యం, పాక్ ప్రజలు అందరూ ఎప్పటికీ శాంతి సందేశమే పంపాలని కోరుకుంటున్నారు. ఈ అంశాన్ని చర్చల ద్వారానే పరిష్కరించాలని భావిస్తున్నాం. యుద్ధం వల్ల ఏం సాధించలేం అని రెండు దేశాలూ తెలుసుకోవాలి. మా ప్రధాని చెప్పినట్లు యుద్ధం ప్రారంభించడం సులభమే. కానీ దానిని ముగించడం కష్టం. ఇప్పటికీ మేం మా సామర్థ్యం చూపించగలం. కానీ మేం ఈ ఉద్రిక్త పరిస్థితిని ఇంకా పెంచాలనుకోవడం లేదు. రెండు దేశాల మధ్య శాంతి పెంచడానికి చర్యలు తీసుకోవలాని కోరుతున్నాం.

రెండు దేశాల్లో ఉపాధి, ఆరోగ్యం అందించే అంశాలపై కూర్చుని చర్చించుకుందాం. యుద్ధంతో ఏదీ పరిష్కారం కాదు. మా ఆఫర్‌ను భారత్ అందుకోవాలి. కూల్‌గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు అంతర్జాతీయ సమాజం కూడా కృషి చేయాలి. రెండు దేశాల మధ్య వాతావరణం కుదుటపడేలా చూడాలి. ఇది శాంతికి ప్రమాదం, మేం దీన్ని విజయంగా భావించడం లేదు. అలా చేస్తే మానవత్వం ఓడిపోతుంది. పాక్ మీడియాకు కూడా అబ్జెక్టివ్ రిపోర్టింగ్ చేయాలని చెప్పాం. శాంతి కోసం రిపోర్టింగ్ చేయాలని కోరాం. రెండు దేశాల మధ్య శాంతి స్థాపన దిశగా మీడియా కూడా ప్రయత్నించాలి.

Related posts