telugu navyamedia
రాజకీయ వార్తలు

నేపాల్ లో వ్యాక్సిన్ తీసుకుంటున్న ఇండియన్స్… ఎందుకంటే…?

corona vacccine covid-19

మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం వ్యాక్సిన్ కోసం అనేకమంది భారతీయులు నేపాల్ బాటపడుతున్నారు.  దీనికి కారణం లేకపోలేదు, అనేకమంది భారతీయులు చైనాతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న సంగతి తెలిసిందే.  చైనాలో ఉద్యోగాలు చేస్తున్నారు.  అలానే చైనాలోని వివిధ విశ్వవిద్యాలయాలలో చదువుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు .  ఎవరైనా సరే చైనాలో అడుగుపెట్టాలి అంటే చైనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆ దేశం షరతు విధించింది.  ఇండియాలో చైనా వ్యాక్సిన్ కు అనుమతి లేకపోవడంతో… అనేకమంది నేపాల్ వెళ్లి అక్కడ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు.  వేలాది మంది భారతీయులకు చైనాలో వ్యాపారాలు ఉన్నాయి.  దీంతో అక్కడి వెళ్ళాలి అంటే చైనా వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి కావడంతో నేపాల్ లోని ఖాట్మండు వెళ్లి అక్కడ వ్యాక్సిన్ తీసుకుంటున్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొన్నది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts