telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఆస్ప‌త్రుల్లో ఆక్సిజ‌న్ కొరత…

oxygen sylender

రాష్ట్రంలో వ‌రుస‌గా కేసులు పెర‌గ‌డం.. క్ర‌మంగా ఆస్ప‌త్రుల‌కు తాకిడి పెర‌గ‌డంతో.. ఆక్సిజ‌న్‌కు కొర‌త ఏర్ప‌డింది.. దీంతో.. ఆస్ప‌త్రులు, అంబులెన్స్‌లు సైతం ఆక్సిజ‌న్ ఏజెన్సీల ద‌గ్గ‌ర క్యూ క‌ట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.. విజ‌య‌వాడ‌లో గత నాలుగు రోజులుగా ఆక్సిజన్ కు భారీగా డిమాండ్ పెరిగిపోయింది.. మరో మూడు రోజుల్లో నగరంలో నిల్వ ఉన్న ఆక్సిజన్ మొత్తం అయిపోతుంద‌ని చెబుతున్నారు ఆక్సిజన్ సప్లేయర్స్.. నగరవ్యాప్తంగా  అన్ని చోట్లా ఆక్సిజన్ కొర‌త ఏర్ప‌డ‌డంతో.. గతంలో 6, 7 ట‌న్నులు అవసరం ఉండగా ఇప్పుడు రోజుకి 40 నుండి50 టన్నుల కావాల్సి వ‌స్తుంద‌ని చెబుతున్నారు.. దీంతో.. 24 గంటలు పని చేసిన అందరికీ ఆక్సిజన్ అందించలేకపోతున్నాం అని ఏజెన్సీలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాయి.. అయితే, ఇప్ప‌టికే ప్రధాన కేంద్రల వద్ద నుండే గ్యాస్ స‌ర‌ఫ‌రా ఆగిపోయింద‌ని.. ఏ రాష్ట్రం వారు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి ప్లాంట్స్.. ఆక్సిజ‌న్ మ‌ల్లిస్తున్నాయ‌ని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts