telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

15 ఏళ్ళ పసివాడి తలలోకి 10 అంగుళాల కత్తి…!?

అమెరికాలోని కాన్సాస్‌లో గురువారం ఇంటి బయట ఆడుకుంటున్న ఎలీ గ్రెగ్ అనే 15 ఏళ్ల పిల్లోడికి పది అంగుళాల కత్తి కన్ను కింద నుంచి గుచ్చుకుంటూ తలలోకి వెళ్లిపోయింది. ఎలీ కేకలు విన్న తల్లి జిమ్మీ రస్సెల్ వెంటనే బయటకు వచ్చి పరిస్థితిని చూసి భయపడిపోయింది. వెంటనే తన కొడుకును దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. యూనివర్శిటీ ఆఫ్ కాన్సాస్ హెల్త్ సిస్టమ్‌లోని సర్జన్లు చాకచక్యంగా పనిచేసి కత్తిని బయటకు తీసి ఎలీ ప్రాణాలను కాపాడారు. అయితే కన్ను కింద నుంచి బలంగా తల లోపలకు వెళ్లలంతో కన్ను పోయే అవకాశమున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. ఎలీని ఆసుపత్రికి తీసుకొచ్చినప్పటికీ అసలు బతకడేమో అని భావించామని, అయినా తమవంతుగా ప్రయత్నించామని, తమ ప్రయత్నం ఫలించిందని డాక్టర్లు చెప్పారు. అందుకే పిల్లలూ కత్తి లాంటి పదునైన వస్తువులకు దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు డాక్టర్లు. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు జరిగితే ప్రాణాలు పోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది.

Related posts