telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

శ్రీకారం ట్రైలర్ వచ్చేసింది…

హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. సినిమా జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్న హీరోగా కూడా శర్వానంద్ పేరు తెచ్చుకున్నాడు. తాజాగా శర్వానంద్ చేస్తున్న సినిమా శ్రీకారం. ఇందులో శర్వా సరసన నాని గ్యాంగ్‌లీడర్ బ్యాటీ ప్రియాంగా అరుళ్ మోహన్ నిటిస్తోంది.  మహాశివరాత్రి సందర్భంగా మార్చి11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. అయితే ఆ ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది ఈ సినిమా సమాజానికి ఓ గొప్ప మెసేజ్ ఇచ్చే విధంగా రూపొందించారు అనేది. ఇందులో హీరో శర్వానంద్ ఓ రైతు పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా మొత్తం కూడా వ్యవసాయం బ్యాక్ గ్రౌండ్ లోనే తీశారు. ఇక ఈ సినిమా ద్వారా దర్శకుడు కిశోర్ పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. దీనిని 14 రీల్స్ ప్లస్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత శర్వానంద్ ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి డైరెక్టన్‌లో చేయనున్నాడు. ఈ సినిమాలో సిద్ధార్థ, శర్వానంద్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. మహా సముద్రం అనే టైటిల్ తో ఈ సినిమా రానుంది.

Related posts