ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వచ్చిన వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో కిమ్ ను గుర్తు చేసుకున్న ట్రంప్, ప్రస్తుతానికి నేను ఒక్కటే చెప్పగలను. ఆయన బాగుండాలని కోరుకుంటున్నా, అతనితో నాకు సత్సంబంధాలే ఉన్నాయన్నారు.
ఆయన బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. వస్తున్న వార్తల ప్రకారమైతే, ఆయన పరిస్థితి చాలా తీవ్రంగా విషమించినట్టేనని భావించాలన్నారు.ఇక కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యక్ష సమాచారం ఏమైనా లభించిందా? అన్న ప్రశ్నకు ట్రంప్ సమాధానాన్ని ఇవ్వలేదు. వస్తున్న వార్తలు నిజమో, కావో కూడా తనకు తెలియదని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.
ఆర్టీసీని తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం అదనపు భారమే: జేసీ