telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రెండవరోజు కేసీఆర్ .. ప్రోజెక్టుల పరిశీలన.. పనులు త్వరగా చేయాలనీ సూచన..

kcr second day supervising kaleswaram

కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీటి ప్రాజెక్టుల పనులను ప్రస్తుతం ఆయన స్వయంగా సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కాళేశ్వరం పనులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండో రోజూ పరిశీలించారు. మంగళవారం మేడిగడ్డ, కన్నేపల్లి పంపుహౌస్‌లను పరిశీలించిన ఆయన రాత్రి కరీంనగర్‌లో బస చేశారు.

ఈ ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో కన్నేపల్లికి చేరుకున్న ఆయన.. 13.2 కిలోమీటర్ల మేర అక్కడ జరుగుతున్న గ్రావిటీ కాలువ పనులను రోడ్డు మార్గంలో పరిశీలించారు. నాలుగు చోట్ల ఆగి గ్రావిటీ కాలువ పనులను చూశారు. పనులు నెమ్మదించడాన్ని గమనించిన ఆయన త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. లైనింగ్‌ పనులు మరింత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అక్కడి నుంచి అన్నారం బ్యారేజీ వద్దకు వెళ్లారు. 66 గేట్ల బిగింపు, 90 శాతం పనులు అక్కడ పూర్తవ్వడంతో అధికారులను అభినందించారు. మిగిలిన పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బ్యారేజీని సందర్శించారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవనం పనులను పరిశీలించనున్నారు.

Related posts