telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రామ్ సరసన ఉప్పెన బ్యూటీ ఫిక్స్…

ఎనర్జిటిక్ స్టార్ రామ్ రెడ్ సినిమా తరువాత తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఎప్పుడో వచ్చింది. ఈ సినిమాతో రామ్ తమిళ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయనున్నారు.ఈ సరికొత్త కాంబో సినిమాని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రపై సినీ వర్గాల్లో ఓ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా చేయనుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీనే హీరోయిన్ అని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. అయితే తన తొలి చిత్రంతోనే కృతి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంది. ప్రస్తుతం కృతి నాచురల్ స్టార్ నాని తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్‌లో… అలాగే మోహన్ కృష్ణ ఇంద్రగంటితో సుధీర్ బాబు చేయనున్న సినిమాలోనూ నటిస్తుంది. చూడాలి మరి ఈ సినిమాలు అన్ని కృతికి హిట్ అందిస్తాయా… లేదా అనేది.

Related posts