మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’. కొణిదెల ప్రొడక్షన్ రాంచరణ్ నిర్మిస్తున్న ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఒకప్పటి బ్రిటీష్ సైన్యానికి ఎదురు నిలబడి స్వాతంత్రం కోసం పొరాడిన మొట్టమొదటి తెలుగు వీరుడు..రేనాటి సూరీడుగా పిలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా’ మూవీ తెరకెక్కించారు. ‘సైరా నరసింహారెడ్డి’ బయోపిక్ కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో అగ్రతారాగణం నటిస్తున్నారు. చిరంజీవి గురువుగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్, చిరంజీవి భార్యగా నయనతార నటించగా మరో ముఖ్యపాత్రలో తమన్నా నటిస్తుంది. ఇక కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ నటిస్తున్నారు. కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఇంత మంది ఒక ఎత్తు అయితే..మెగా ఫ్యామిలీ నుంచి మొదటి సారిగా వెండి తెరపై హీరోయిన్ గా నటించిన మెగాబ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక నటించడం.
చిన్ననాటి నుంచి తన పెద్దనాన్నను చూస్తూ పెరిగిన నిహారిక ఆయనతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తుంది. కానీ అప్పటికే చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో ఆ అవకాశం దక్కలేదు. చిరంజీవితో చిన్నతనంలో వరుణ్ తేజ్ ఓ మూవీలో నటించే అవకాశం దక్కింది..కానీ నిహారికకు ఆ ఛాన్స్ దక్కలేదు. కానీ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’తో ఆ కోరిక తీరింది. సైరా సినిమాలో ఒక మన్యం పిల్లగా నిహారిక రెండు సార్లు కనిపించనుందని పాత్ర నిడివి తక్కువే అయినా మెగా అభిమానుల మనసును తాకే విధంగా నిహారిక పాత్ర ఉంటుందట. తాజాగా రిలీజ్ అయిన ‘సైరా’ ట్రైలర్ లో నిహారిక పోరాట సన్నివేశంలో కనిపిస్తుంది. అంటే ఆమె పాత్ర కూడా ఇందులో పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్టు కనిపిస్తుంది. మొత్తానికి తన పెద్దనాన్నతో కలిసి నటించే అవకాశమే కాదు..ఓ ప్రతిష్టాత్మక మూవీలో నిహారిక ఛాన్సు దక్కించుకోవడం అదృష్టం అని చెప్పుకోచ్చు.