telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇజ్రాయిల్ కాల్పుల విరమణ…

కొన్ని రోజులుగా ఇజ్రాయిల్… గాజాల మధ్య యుద్దవాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గాజాలోని హమాస్ తీవ్రవాదులకు ఇజ్రాయిల్ కు మధ్య భీకరమైన పోరు జరిగింది. జేరూసలెంపై హమాస్ తీవ్రవాదులు కొన్ని వందల రాకెట్లతో దాడులు చేయగా, ఇటు ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో దాదాపుగా 200 మంది వరకు పాలస్తీనా పౌరులు మరణించారు. వేలాది మంది నిరాశ్రయులు కాగా, లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాడులు ఆపాలని, కాల్పుల విరమణను పాటించాలని ఇజ్రాయిల్ పై ఒత్తిడి రావడం మొదలైంది. ఇజ్రాయిల్ కు మద్దతు ఇచ్చిన అమెరికా సైతం ఈ విషయంలో ఒత్తిడి తీసుకొచ్చింది. ఇస్లామిక్ దేశాలు సైతం ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టకేలకు కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ అంగీకరించింది. ఈ విషయాన్ని హమాస్ ఉగ్రవాద సంస్థ కూడా ధృవీకరించింది.

Related posts