కానిస్టేబుల్ కొలువుల భర్తీకి ఆదివారం నిర్వహించిన తుదిరాత పరీక్ష ప్రశాతంగా ముగిసింది. ఈ పరీక్ష ద్వారా తెలంగాణ పోలీసు శాఖలో 17,156 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాల్లోని 194 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్షను నిర్వహించారు. కానిస్టేబుల్ సివిల్‌కు 1,05,094 మంది, కానిస్టేబుల్ ఐటీ అండ్ సీకి 5,163 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
ఈ పరీక్షలో కానిస్టేబుల్ సివిల్ పరీక్షకు 1,03,720 మంది.. మధ్యాహ్నం జరిగిన కానిస్టేబుల్ ఐటీ అండ్ సీ పరీక్షకు 4,705 మంది అభ్యర్థులు హాజరయినట్లు పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో ప్రాథమిక కీ విడుదల చేస్తామన్నారు.
దర్శకనిర్మాతలు చెప్పేదొకటి చేసేది మరొకటి : శ్రీయ శరణ్