telugu navyamedia
క్రీడలు వార్తలు

బీసీసీఐ అభిమానుల ఆగ్రహం…

బీసీసీఐ 2020-2021 సీజన్‌కుగాను మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్‌ జాబితాను బుధవారం ప్రకటించింది. గతేడాది కాంట్రాక్ట్‌లలో 22 మంది ఉండగా… ఈసారి దానిని 19 మందికి పరిమితం చేసింది. వార్షిక కాంట్రాక్ట్‌ ఫీజుల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. గ్రేడ్‌ ‘ఎ’లో ఉన్న వారికి ఏడాదికి రూ. 50 లక్షలు… గ్రేడ్‌ ‘బి’ వారికి రూ. 30 లక్షలు… గ్రేడ్‌ ‘సి’ వారికి రూ. 10 లక్షలు లభిస్తాయి. అయితే ఈ కాంట్రాక్ట్‌లపై అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురుష క్రికెటర్ల వేతనాలు కోట్ల రూపాయల్లో ఉంటే.. మహిళా క్రికెటర్లకు మాత్రం లక్షల్లో చెల్లించడం ఏంటని సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. పురుష క్రికెటర్ల కాంట్రాక్టుల్లో గ్రేడ్ ఏ+లో ఉన్న వారికి రూ. 7 కోట్లు.. గ్రేడ్‌ ‘ఎ’లో ఉన్న వారికి ఏడాదికి రూ. 5 కోట్లు… గ్రేడ్‌ ‘బి’ వారికి రూ. 3 కోట్లు… గ్రేడ్‌ ‘సి’ వారికి కోటి రూపాయల వార్షిక వేతనం అందుతుంది. కానీ మహిళల క్రికెటర్లలో గ్రేడ్ ఏలో ఉన్నవారికి మాత్రం రూ. 50 లక్షల వేతనమే ఇస్తున్నారు. మహిళల టాప్ గ్రేడ్‌కు పురుషుల ఏ+ గ్రేడ్‌కు 14 రెట్ల వ్యత్యాసం ఉంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు బీసీసీఐపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈక్వల్ పే అందించాలని కొంతమంది అంటుండగా.. కనీసం గౌరవ వేతనాలైన అందించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తోంది. మహిళా క్రికెటర్ల కనీసం టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్‌కు వెళ్లారని పురుష క్రికెటర్లు మాత్రం సెమీఫైనల్లోనే ఇంటి దారిపట్టారని… అయినా విరాట్ కోహ్లీకి హర్మన్ ప్రీత్ కౌర్ కంటే 14 రెట్లు ఎక్కువ జీతం అందుతుందని, వారికి గౌరవ వేతం ఇచ్చి అండగా నిలవాలని కోరాడు. అమ్మాయిలు క్రికెట్ బాగా ఆడుతున్నారని, వారికి మంచి జీతాలు అందజేయాలని అంటున్నారు.

Related posts