telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్ర‌భుత్వం రైతు స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టాలి: లోక్‌స‌భ‌లో రాహుల్‌

rahul gandhi to ap on 31st

లోక్‌స‌భ‌ సమావేశాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైతు సమస్యలను ప్రస్తావించారు. దేశంలో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్ర‌భుత్వం రైతు స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టాల‌న్నారు. కేంద్ర బ‌డ్జెట్‌లో ప్ర‌భుత్వం రైతుల‌కు ఎటువంటి ఊర‌ట క‌ల్పించ‌లేద‌ని రాహుల్ అన్నారు. కేర‌ళ ప్ర‌భుత్వం ఇచ్చిన నివేదిక‌ను ఆర్బీఐ స్వీక‌రించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాహుల్ కేంద్రాన్ని కోరారు.

రిక‌వ‌రీ నోటీసుల‌తో రైతులను బెదిరించ‌కుండా చూసుకోవాల‌న్నారు. సుమారు 8 వేల మంది రైతుల‌కు వ‌య‌నాడ్‌లో నోటీసులు ఇచ్చార‌న్నారు. రుణాల‌కు ప్రాప‌ర్టీ అటాచ్ చేయ‌డం వ‌ల్లే రైతులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతున్న‌ట్లు రాహుల్ చెప్పారు. రుణం తీర్చ‌లేక ఓ రైతు వ‌య‌నాడ్‌లో బుధ‌వారం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు రాహుల్‌ పేర్కొన్నారు.

Related posts