telugu navyamedia
రాజకీయ వార్తలు

స్పీకర్ ను నేరుగా కలవాలి..కర్ణాటక రెబెల్ ఎమ్మెల్యేలకు సుప్రీం ఆదేశం

supreme court two children petition

తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించడం లేదంటూ 10 మంది కర్ణాటక రెబెల్ ఎమ్మెల్యేలు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టులో రెబెల్ ఎమ్మెల్యేల తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదిస్తూ, స్పీకర్ గా నిర్వహించాల్సిన బాధ్యతలను రమేశ్ కుమార్ నిర్వహించడం లేదని తెలిపారు.

ఈ పిటిషన్ ను విచారించిన కోర్ట్ సాయంత్రం 6 గంటల్లోగా స్పీకర్ ను నేరుగా ఎమ్మెల్యేలుకలవాలని ఆదేశించింది. రాజీనామా చేయాలనుకున్న వారు తమ రాజీనామా పత్రాలను నేరుగా స్పీకర్ రమేశ్ కుమార్ కు అందజేయాలని సూచించింది. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాదు, రెబెల్ ఎమ్మెల్యేలకు భద్రతను కల్పించాలని కర్ణాటక డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

Related posts