telugu navyamedia
క్రీడలు వార్తలు

నా బలం అదే అంటున్న హర్షల్…

ఐపీఎల్ 2021 లో భాగంగా నిన్న చెన్నై వేదిజగా ముంబై ఇండియన్స్‌తో తలపడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. చిట్టచివరి బంతికి విజయాన్ని సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఎనిమిది వికెట్లను కోల్పోయి అందుకుంది. హార్డ్ హిట్టర్లతో నిండివున్న ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసి స్కోర్‌బోర్డుపై తక్కువ పరుగులను నమోదు చేయగలిగడానికి కారణం ఆర్సీబీ బౌలర్లే. మహ్మద్ సిరాజ్, కైలే జెమిసన్, హర్షల్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలిగారు. ఈ క్రమంలో హర్షల్ పటేల్ అయిదు వికెట్లను పడగొట్టాడు. నాలుగు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లను తీసుకున్నాడు. పించ్ హిట్టర్లుగా గుర్తింపు ఉన్న ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యాలను పెవిలియన్ దారి పట్టించాడు. చివరలో మార్కో జెన్‌సేన్‌ను అవుట్ చేయడంతో అయిదు వికెట్ల క్లబ్‌లో చేరాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అయితే స్లోయర్ బంతులే తన ప్రధాన బలమని చెప్పాడు. వైవిధ్యంతో కూడిన బంతులను సంధించగలుగుతున్నానని పేర్కొన్నాడు. 15, 20 రోజులుగా యార్కర్లపై దృష్టి పెట్టానని, డెత్ ఓవర్లలో బ్యాట్స్‌మెన్లను కట్టి పడేయడానికి అదే ప్రధాన కారణమని చెప్పాడు.

Related posts