telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హల్చల్…

JC Prabhakar Reddy Corona

ఏపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హల్చల్ చేశారు.  సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా వార్తలు వచ్చాయని కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆయనకు వ్యతిరేకంగా జేసి వర్గమే సోషల్ మీడియాలో వార్తలు ప్రసారం చేస్తోందని అయన మండిపడ్డారు.  ఆగ్రహంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి, ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు యువకులపై కేతిరెడ్డి దాడికి పాల్పడ్డారు.  కేతిరెడ్డి దాడి చేసిన సమయంలో జేసి ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు ఎవరూ ఇంట్లో లేనట్టుగా సమాచారం.  అయితే, తన ఇంట్లోని ఇద్దరు యువకులపై కేతిరెడ్డి దాడి చేయడంతో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తన ఇంట్లోని యువకులపై దాడి చేసిన కేతిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదిలా ఉంటె, జేసీ దివాకర్ రెడ్డి సమీపంలో కేతిరెడ్డి వర్గం, దివాకర్ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తులు మోహరించారు.  పరస్పరం రాళ్లదాడులకు పాల్పడ్డారు.  అయితే, వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.  ఇరు వర్గాల ఆందోళనలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.  పోలీసులను లెక్క చేయకుండా ఇరు వర్గాలు రాళ్ళు రువ్వుకోవడంతో ఇరు వర్గాలకు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రికి బయలుదేరారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts