నాగార్జునసాగర్ అభివృద్ధి మేనిఫెస్టోను మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ముఖ్య నేతలు విడుదల చేశారు. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు అందుకు నిదర్శనమే దుబ్బాక విజయం అని అన్నారు. సాగర్ లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని అభివృద్ధి విషయంలో జానారెడ్డి నియోజకవర్గానికి చేసింది సున్నా, టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ బాటలోనే సాగిందని అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు. తండాల అభివృద్ధికి టీఆర్ఎస్ నిధులు మంజూరు చేయలేదన్న ఆయన గత ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు. సాగర్ లో బీజేపీకీ ఈసారి అవకాశం ఇచ్చి రాజకీయ మార్పుకు ప్రజలు ఆమోద ముద్ర వేయాలని అన్నారు. బీజేపీని గెలిపిస్తే ఇండస్ట్రియల్ కారిడార్,రీజనల్ రింగ్ రోడ్ నుంచి సాగర్ వరకు రోడ్డు నిర్మాణం చేస్తామని అన్నారు.
next post
బందర్ పోర్టుని తెలంగాణకు ఎంతకు అమ్మేశారు: ప్రశ్నించిన దేవిదేని