telugu navyamedia
క్రీడలు వార్తలు

వారిని 8 ఏళ్ళు బ్యాన్ చేసిన ఐసీసీ…

ICC

2019 టీ20 ప్రపంచకప్‌ అర్హత పోటీల్లో ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెటర్లు మహ్మద్‌ నవీద్‌, షైమన్‌ అన్వర్ బట్‌లపై‌ ఐసీసీ చర్యలు తీసుకుంది. ఈ ఇద్దరిపై ఏకంగా ఎనిమిదేళ్లు నిషేధం విధించింది. 2019 అక్టోబర్‌ 16 నుంచి శిక్ష అమల్లోకి వస్తుందని పేర్కొంది. ప్రాథమికంగా తప్పు చేసినట్టు తేలడంతో.. ఐసీసీ రెండేళ్ల క్రితమే వారిపై తాత్కాలిక నిషేధం అమలు చేసింది. ‘మహ్మద్‌ నవీద్‌, షైమన్‌ అన్వర్‌ బట్ యూఏఈ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడారు. నవీద్‌ జట్టుకు కెప్టెన్ కూడా. జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీశాడు. అన్వర్‌ యూఏఈ జట్టుకి ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గానూ సేవలందించాడు. సుదీర్ఘ కాలంగా ఆడుతున్న వీరికి మ్యాచ్‌ ఫిక్సర్ల నుంచి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. దాంతో వారు సహచరులు, ప్రత్యర్థులు, అభిమానులను మోసం చేశారు’ అని ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ ఓ ప్రకటనలో తెలిపారు.అలాగే ఐసీసీ తమ నిబంధనల ప్రకారం మహ్మద్‌ నవీద్‌, షైమన్‌ అన్వర్‌ బట్‌లను‌ ఐసీసీ దోషులుగా పరిగణించి చర్యలు తీసుకుంది.

Related posts