భారత-బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టీ20 గెలిచి 1-0ఆధిక్యంతో కొనసాగుతుంది. ఐదుగురు యువ క్రికెటర్లతో బరిలోకి దిగిన భారత్.. పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మేరకు తర్వాతి మ్యాచ్‌లలో జట్టులో ఏదైనా మార్పులు ఉంటాయా అని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చాడు. కింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో తాత్కాలిక కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.
ఈ ఫార్మాట్ ఎంతో మంది క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్లో నిలదొక్కుకునేందుకు సహాయపడుతుంది. టాలెంట్ తో ఉన్న యంగ్ ప్లేయర్లను తీసుకునేందుకు కీలకమైన ఆటగాళ్లు మ్యాచ్ లకు దూరంగా ఉంటున్నారు. అందుకే ఫార్మాట్ ను బట్టి వేరే జట్టుతో ఆడుతూ వస్తున్నాం. టీ20 లాంటి ఫార్మాట్లలో వారిని ఆడిస్తే ఎటువంటి నష్టాలు ఉండవు, చాలా మంది ప్లేయర్లను ఈ ఫార్మాట్లో ఆడించాం. వన్డే, టెస్టు ఫార్మాట్లలో ఆడేందుకు వారికి అనుభవం పనికొస్తుందని రోహిత్ చెప్పుకొచ్చాడు.
గులాబీ జెండా ఎగరడం ఖాయం: మంత్రి గంగుల