telugu navyamedia
రాజకీయ వార్తలు

అమెరికాను ముందు నిలిపేది నేనే: డొనాల్డ్ ట్రంప్

trump usa

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఐదు దశాబ్దాల పాటు నాశనం చేసిన ఏకైక వ్యక్తి బైడెనేనని అభివర్ణించారు. అధ్యక్షుడిగా జో బైడెన్ విజయం సాధిస్తే అమెరికాపై చైనా విజయం సాధించినట్టేనని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఓహియో రాష్ట్రంలోని డేటాన్ లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్, గడచిన 47 సంవత్సరాలుగా చైనా సహా పలువురు విదేశీయులకు అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలు వెళ్లేట్లుగా బైడెన్ చేశాడని ఆరోపించారు. నవంబర్ 3న దేశ ప్రజలు, తదుపరి నాలుగేళ్ల తమ భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సి వుంటుందని అన్నారు.

అమెరికన్లపై మరే దేశ ఆధిపత్యాన్ని అంగీకరించని ఎవరూ బైడెన్ ను అధ్యక్షుడిగా ఎంచుకోరని అన్నారు. నిద్రమత్తులో ఉండే బైడెన్ అధికారంలోకి వస్తే, ఆర్థిక వ్యవస్థ సర్వ నాశనం అవుతుందన్నారు. మీరంతా కలిసి అమెరికాను ముందు నిలపాల్సిన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. నేను అమెరికాను ముందు నిలిపాను అని ట్రంప్ సమర్థించుకున్నారు.

Related posts