లేనోడికి
పూట గడిస్తే చాలు
ఉన్నోడికి
కోట్లు గడించినా చాలదు
పేదోడిది
అవసరం కోసం పోరాటం
ధనికుడిది
విలాసం కోసం ఆరాటం
బీదవాడు బ్రతకలేక
రోజు చావాలనుకుంటాడు
శ్రీమంతుడు ప్రాణం మీద తీపితో
రోజు బ్రతకాలనుకుంటాడు
-కయ్యూరు బాలసుబ్రమణ్యం,
శ్రీకాళహస్తి