telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఆఫ్ఘన్ బౌలర్లపై మోర్గాన్ శివతాండవం..17 సిక్సర్లతో ప్రపంచ రికార్డ్

england captain eoin morgan

ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు మాంచెస్టర్ లో పసికూన ఆఫ్ఘనిస్థాన్-ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచులో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయార్ మోర్గాన్ విరుచుకుపడ్డాడు. వన్డేల్లో 17 సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సెకండ్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన మోర్గాన్ ఆఫ్ఘన్ బౌలర్లు వేసిన బంతులను ఎదుర్కొని సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

గతంలో ఈ రికార్డు క్రిస్ గేల్, ఏబీ డివిల్లీర్స్, రోహిత్ శర్మల పేరిట ఉంది. 16 సిక్సర్ల గత రికార్డును మోర్గాన్ ఘనంగా తిరగరాశాడు. రషీద్ ఖాన్ లాంటి మిస్టరీ బౌలర్ సైతం మోర్గాన్ కొట్టిన బలమైన షాట్ల ముందు తట్టుకోలేద్క పోయాడు. మోర్గాన్ అవుటయ్యే సమయానికి రషీద్ ఖాన్ 8 ఓవర్లలో 96 పరుగులు  ఇచ్చాడు. 

Related posts