telugu navyamedia
వార్తలు సామాజిక

భారత్‌లో భారీగా కరోనా కేసులు..లాన్సెట్ కీలక వ్యాఖ్యలు

Corona

భారత్‌లో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో ఊహించని రీతిలో కరోనా కేసులు పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అనుసరిస్తోన్న విధానాలపై లాన్సెట్ కీలక వ్యాఖ్యలు చేసింది.

కరోనా ఉద్ధృతి అత్యధికంగా ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం ఏమీ కాదులే అన్న ధోరణితో వ్యవహరిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.ఐసీఎంఆర్ శాస్త్రీయ ఆధారాల నుంచి పక్కకుపోతోందని లాన్సెట్ మెడికల్ జర్నల్ సంపాదకీయంలో చెప్పింది. ఈ ధోరణులతో ప్రజలకు తప్పుడు సంకేతాలు అందుతాయని చెప్పింది.

కోవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజలను ఈ చర్యలు నిరోధిస్తాయని చెప్పింది. ఈ చర్యలు భారత్‌లో మరింత సంక్షోభానికి దారితీస్తాయని చెప్పింది. కరోనా విజృంభణ పట్ల భారత సర్కారు చాలా పాజిటివ్ ధోరణితో ఉందని తెలిపింది. దేశంలో విపరీతమవుతోన్న కొవిడ్‌ సంక్షోభం మధ్య వాస్తవాలను దాచవద్దని తెలిపింది. అసలు నిజాలు చెప్పకపోతే ప్రజలకు ప్రమాదమని హెచ్చరించింది.

Related posts