ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఈసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీ పార్టీలతో కలిసి వెళ్తున్నారు.
గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లు ఓడిపోయిన పవన్ కల్యాణ్..ఈసారి గెలిచి చట్ట సభల్లో అడుగుపెట్టాలని గట్టి పట్టుదల మీద ఉన్నారు.
ఈక్రమంలో ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. ఇప్పటికే ఆయన పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
పవన్ విజయోత్సవానికి మద్దతుగా మెగా హీరోలు ప్రచారంలో పాల్గొన్నారు. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి నటులతో పాటు పలువురు ప్రముఖులు పవన్ విజయం కోసం పిఠాపురంలో ర్యాలీలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఎంపిక చేసిన కొంతమందితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు.
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు, నిర్మాత శరత్ మరార్‌తో కూడా పవన్ కల్యాణ్ చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటారు.
తాజాగా నిర్మాత శరత్ మరార్ ఓ ఇంటర్య్వూలో పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
పవన్ కళ్యాణ్ నిర్మాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే వదంతులు అవాస్తవమని శరత్ మరార్ స్పష్టం చేశారు. ఇంకా చెప్పాలంటే ఆయన పవన్ నిర్మాతలను ఆదుకుంటారని ఆయన తెలిపారు.
అంతేకాకుండా తన దగ్గర పని చేసే మహిళ వాళ్ల భర్త ఆమె మంగళ సుత్రాన్ని అమ్మి పేకాట ఆడాడు.
ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఆమెకు ధైర్యం చెప్పడమే కాకుండా .. ఆర్థిక సాయం కూడా చేశారని శరత్ మరార్ తెలిపారు.
అంతేకాకుండా ఆమె భర్తను పిలిపించి పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చినట్టు ఆయన తెలిపారు.
పవన్ కల్యాణ్ మంచి మనస్సున్న వ్యక్తి అని శరత్ మరార్ చెప్పుకొచ్చారు. పవన్ గురించి శరత్ మరార్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.