డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తాజాగా తన పూరీ మ్యూజింగ్స్‌లో “పెళ్లి” గురించి మాట్లాడారు. ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ”మ్యారేజ్ అనే దానికి పోయేకాలం దగ్గరకొచ్చింది. మ్యారేజ్ అంత మంచిదే అయితే యేసు క్రీస్తు 10 పెళ్లిళ్లు చేసుకునేవాడు. ఉన్న పెళ్ళాన్ని వేదిలేయడం వల్లే ఆ రాజుల కుర్రాడు బుద్ధుడయ్యాడు. మీ ఆలోచనలు గొప్పగా ఉంటే అస్సలు పెళ్లి చేసుకోవద్దు. ఎవ్వరికీ తాళి కట్టొద్దు. లైఫ్‌లో ఏదైనా చేయాలి.. ప్రపంచమంతా తిరగాలి అనే పట్టుదల, కసి గనక మీలో ఉంటే మీ కాళ్ళకి పారాణి మాత్రం రాయొద్దు. ఎలాగూ నేను బుర్రతక్కువ వెధవనే. పాప, బాబుతో ఆడుకుంటా.. వర్షంలో మా ఆవిడ పకోడీలు వేస్తుంటే తింటా, టీవీలో సీరియల్స్ చూస్తా లాంటి ఆలోచనలు మీలో ఉంటే వెంటనే మీ వెడ్డింగ్ కార్డు పంపండి. వచ్చి ఆశీర్వదిస్తా. మనలాంటి పిట్ట బ్రెయిన్ ఉన్నవాళ్లే పెళ్లి చేసుకుంటారు. జీనియస్‌లు ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకోవడం తప్పు అని ఏ మతమూ చెప్పదు. చెప్తే ఆ మతం ఎగిరిపోద్ది. పెళ్లి చేసుకోకపోతే గుడికి వెళ్లే పనుండదు.. పూజలు, వ్రతాలు కట్. ఫైనల్‌గా దేవుడితో కనెక్షన్ కట్ అవుతుంది. అందుకే వాళ్ళు పెళ్లి గురించి నిజాలు చెప్పరు. గుర్తుపెట్టుకో.. పెళ్లైన వాళ్లంతా పెళ్లికాని బాబాల కాళ్ళ మీదే పడతారు. పెళ్లికాని హీరోయిన్‌కి ఉన్న ఫాలోయింగ్ పెళ్లి చేసుకున్న హీరోయిన్‌కి ఉండదు. అందుకే మిమ్మల్ని మీరు తాడేసుకు కట్టేసుకోకండి. పెళ్లి చేసుకోమని ఇంట్లో మీ నాన్న గానీ ఒత్తిడి చేస్తే ఆయన పెళ్లే చేసేయ్.. దూల తీరుద్ది. మీ అమ్మమ్మ అడిగితే దానికీ చేసేయ్. నువ్వు మాత్రం చేసుకోవద్దు” అన్నారు.
previous post