telugu navyamedia
క్రీడలు వార్తలు

దానికి కోహ్లీనే సమాధానం చెప్పగలడు : యువీ

Yuvraj

ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ… డబ్ల్యూటీసీ ఫైనల్లో తన ఫేవరెట్‌ కోహ్లీసేననే అని, అయితే న్యూజిలాండ్‌కే కాస్త ఎక్కువ ప్రయోజనం కనిపిస్తోందన్నాడు. నిజానికి డబ్ల్యూటీసీ ఫైనల్లో మూడు మ్యాచులు ఉంటే బాగుండేదని యువరాజ్ అభిప్రాయపడ్డాడు. సౌథాంప్ట‌న్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య శుక్రవారం డబ్ల్యూటీసీ ఫైన‌ల్ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ నేపథ్యంలో యువరాజ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడాడు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్‌లో నా ఫేవరెట్‌ టీమిండియానే. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడటంతో న్యూజిలాండ్‌కు కాస్త ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. కివీస్ జట్టుకు ఎక్కువ మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించింది. ఫైనల్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగాలని కోరుకుంటున్నా కొన్నిసార్లు టెస్టు క్రికెట్‌ చనిపోతోందని అనిపిస్తుంది. అప్పుడే భారత్‌, ఆస్ట్రేలియాలు హోరాహోరీగా పోటీపడ్డాయి. టువంటి పోరాటాలతో మళ్లీ జవసత్వాలు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంగ్లండ్‌ను సొంతగడ్డపై కివీస్ ఓడించడమూ అలాంటిదే. నేను చూసిన, ఆడిన గొప్ప ఫార్మాట్‌ టెస్టే’ అని యువీ చెప్పాడు. ‘టెస్టు ఛాంపియన్‌షిప్‌ కైవసం చేసుకోవడం ప్రపంచకప్‌ గెలవడంతో సమానమో కాదో నాకు తెలియదు. దీన్ని వివరించేందుకు విరాట్‌ కోహ్లీ లేదా రోహిత్‌ శర్మ సరైనవాళ్లు. 2011 ప్రపంచకప్‌ జట్టులో ఉన్నాడు కాబట్టి కోహ్లీ కచ్చితమైన సమాధానం చెప్పగలడు’ అని యువరాజ్‌ సింగ్‌ అన్నాడు.

Related posts