telugu navyamedia
సినిమా వార్తలు

నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమా రిలీజ్​ డేట్ ఫిక్స్‌

యంగ్​ హీరో నాగశౌర్య, షెర్లియా సేతి జంటగా నటిస్తున్నసినిమా ‘కృష్ణ వ్రింద విహారి”. ఈ సినిమాలో షిర్లీ సెటియా హీరోయిన్ గా న‌టిస్తుంది.

శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్‌. ‘కృష్ణ వ్రింద విహారి ఏప్రిల్‌ 22న వస్తున్నాడు’ అంటూ ట్విటర్‌ వేదికగా పోస్టర్‌ షేర్‌ చేశారు. ‘కృష్ణ వ్రింద విహారిస సినిమా పోస్టర్లు చూస్తుంటే మరో కలర్ ఫుల్ ఎంటర్టైనర్ వస్తున్నట్టు అనిపిస్తోంది. నాగశౌర్య భిన్నంగా, సరికొత్త రోల్ చేస్తున్నట్లు అర్ధ‌మ‌వుతుంది.

Nagashourya Krishna vrinda vihari release date

ఒక సాంగ్‌ తప్ప మిగతా షూటింగ్‌ సుమారు పూర్తయిందని సమాచారం. సీనియర్‌ నటి రాధిక ముఖ్యభూమిక పోషిస్తుండగా, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మహతి స్వరసాగర్‌ సంగీతమందిస్తున్నారు. 

Related posts