telugu navyamedia
సినిమా వార్తలు

తెలుగు సినిమాకు ఆద్యుడు హెచ్ . ఎమ్  రెడ్డి 

HM REDDY,Telugu Industry
సినిమా ఇప్పుడు ప్రధాన వినోదం . సినిమా అంటే ఇష్టపడని వారు , చూడనివారు , మాట్లాడుకోనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు . తెలుగులో మొదట మాట్లాడే సినిమా విడుదలైన రోజు ఫిబ్రవరి 6. అందుకే ఆ చిత్రం గురించి , దర్శకుడు గురించి తెలుసుకుందాం . 
HM REDDY,Telugu Industry
తెలుగులో మొదట  మాట్లాడే సినిమా “భక్త ప్రహ్లాద ” విడుదలైన రోజు . ఈ సినిమాకు  దర్శకత్వం వహించింది  హెచ్ . ఎమ్  రెడ్డి గారు ఈ సినిమా ఫిబ్రవరి 6 , 1932లో విడుదలయ్యింది . అందుకే హెచ్ . ఎమ్  రెడ్డి  గారిని తెలుగు  టాకీ కి ఆద్యుడు అంటారు . మొదటి టాకీ భక్త ప్రహ్లాద విడుదలై నేటికీ సరిగ్గా  87 సంవత్సరాలు . 
హెచ్ . ఎమ్  రెడ్డి  12 జూన్ 1892లో బెంగళూరు నగరంలో జన్మించాడు . ఆయన పూర్తి పేరు హనుమప్ప మునియప్ప రెడ్డి  . బెంగళూరులోనే చదువుకున్నాడు . అక్కడే పోలీస్ అధికారిగా ఉద్యోగంలో  చేరాడు అయితే బ్రిటిష్ వారి దగ్గర పనిచెయ్యడం ఇష్టంలేక ఆ వుద్యోగం వదిలేశాడు . ఆయనకు సినిమా అంటే ఎంతో ఇష్టం అందుకే బొంబాయి  వెళ్లి అర్దేషిర్ ఇరానీ దగ్గర చేరాడు . ఆయనప్పుడు తొలి భారతీయ టాకీ ఆలం  ఆరా నిర్మిస్తున్నాడు . 
HM REDDY,Telugu Industry
ఆ సినిమాకు హెచ్ . ఎమ్  రెడ్డి .సహాయ దర్శకుడుగా పనిచేశాడు . ఆ అనుభవంతోనే  తెలుగులో భక్త ప్రహ్లాద సినిమాకు దర్శకత్వం వహించాడు . ఈ సినిమా నిర్మాణం అంతా బొంబాయి ఇంపీరియల్ స్టూడియో లో జరిగింది . భక్త ప్రహ్లాద పురాణ కథ. అప్పటికే దీనిని సురభివారు నాటకంగా ప్రదర్శిస్తున్నారు . ఇదే కథను సినిమాగా తీశారు .ఇందులో  సి ఎస్ ఆర్ , ఎల్వి  ప్రసాద్ ,సురభి కమలాబాయి మొదలైనవారు  నటించారు . ఆ చిత్రం విడుదలై సంచలన విజయం సాధించింది . అప్పటివరకు మూకీ సినిమాలు చూడటానికి అలవాటుపడ్డ ప్రేక్షకులు మాట్లాడే భక్త ప్రహ్లాద చిత్రానికి బ్రహ్మ రధం పట్టారు . 
HM REDDY,Telugu Industry
ఆ తరువాత రెడ్డి గారు గృహలక్ష్మి ,తెనాలి రామకృష్ణ , ప్రతిజ్ఞ , వద్దంటే డబ్బు చిత్రాలను నిర్మించాడు . 
కాళిదాస్  ,సీతా స్వయం వరం , గృహ లక్ష్మి , మాతృ భూమి ,చదువుకున్న భార్య , బారిస్టర్ పార్వతీశం ,తెనాలి రామకృష్ణ,  ఘరానా దొంగ ,సతి సీత , నిర్దోషి, నిరపరాధి , ప్రతిజ్ఞ చిత్రాలకు దర్శకత్వం వహించాడు . 
ఎల్వి ప్రసాద్, బి ఎన్ రెడ్డి , కెవి రెడ్డి , కమలాకర కామేశ్వర రావు లాంటి వారిని సినిమా రంగానికి పరిచయం చేశారు సినిమాను శ్వాసించి , శాసించిన మహోన్నత దర్శకుడు హెచ్ . ఎమ్  రెడ్డి ఆయన ఎప్పుడు తెలుగు సినిమాకు ఆరాద్యుగా ఉండిపోతాడు .

Related posts