telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

రజనీకాంత్ కొత్త పార్టీ  ఎప్పుడు..?

సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాడు రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రజనీకాంత్ కొత్త పార్టీ  ఎప్పుడు ? అనేదే ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది.  పార్టీ ప్రకటనకు ఆయన రెండు తేదీలపై కసరత్తు చేస్తున్నారు. జనవరి 14న పొంగల్ రోజు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే చాన్సుంది. తమిళులకు పొంగల్ అంటే పెద్ద పండగ. ఆ రోజు పార్టీ ప్రకటన చేస్తే పొంగల్ సెంటిమెంట్ కలిసొస్తుందని రజనీ వర్గం భావిస్తోంది. ఆ రోజు కాకపోతే.. జనవరి 17.. ఎంజీఆర్ పుట్టిన రోజున పార్టీకి సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉంది.  పార్టీ ప్రకటన అనంతరం డిఎంకె అధినేత,మాజీ సిఎం కరుణానిధి సమాధిని రజనీకాంత్ సందర్శించనున్నారు. ఇక పార్టీ పేరుపై గుర్తుపై కూడా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. రజినీ కాంత్ పార్టీ పేరు మక్కల్ సేవై కర్చి అని ప్రచారం జరుగుతున్నది.. ఇక రజినీకాంత్ పార్టీకి ఆటో గుర్తు కేటాయించారని కూడా ప్రచారం సాగుతోంది.. మక్కల్ సేవై కర్చి అంటే ప్రజాసేవ పార్టీ అని అర్ధం… దీనిపై సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెడుతున్నారు.. అయితే, రజనీకాంత్ కొత్త పార్టీ పేరు మక్కళ్ సేవై కట్చి విపరీతంగా ప్రచారం సాగుతోన్న సమయంలో.. దీనిపై రజనీకాంత్ సామాజిక సేవా విభాగం రజనీ మక్కళ్ మండ్రం వివరణ ఇచ్చింది.

Related posts