telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఛార్మి బైక్‌పై లైగర్‌…

విజయ్ దేవరకొండ… పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తరువాత అర్జున్ రెడ్డితో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా తరువాత వెంటనే గీతా గోవిందం అంటూ అమాయకుడిగా కూడా అందరినీ మెప్పించారు. ప్రస్తుతం విజయ్ మాస్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మొదట ఫైటర్ పేరు ప్రచారణలో ఉన్నా సినిమాకు మాత్రం లైగర్ అనే పేరును ఖరారు చేశారు. ఇందులో విజయ్ బాక్సర్‌గా దర్శనమివ్వనున్నారు. ఈ సినిమాను ప్రస్తుతం ముంబైలో చిత్రీకరిస్తున్నారు. అయితే షూటింగ్ మధ్య ఖాలీ సమయాల్లో చార్మీ, విజయ్‌లు ఫన్ రైడ్ కోసం వెళ్లారు. చార్మీ స్కూటీ నడుపుతుండగా విజయ్ వెనకాల కూర్చొని ఉన్నారు. ఈ ఫోటోలను చార్మీ ట్వీటర్‌లో షేర్ చేశారు. అయితే చార్మీ ట్వీట్ వైరల్ అవ్వడానికి కారణం ఆ ఫోటోలు కాదు. ఫోటోల కింద చార్మీ ఇచ్చిన కాప్షన్. ‘ విజయ్‌కి నాపైన చాలా నమ్మకం ఉంది’ అని చార్మీ ఆ ఫోటోలకు కాప్షన్ ఇచ్చారు. అందుకే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాను సెప్టెంబర్9న విడుదల కానుంది.

Related posts