telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

”చావు కబురు చల్లగా” అదిరిపోయే అప్డేట్…

యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం”చావు కబురు చల్లగా”. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసింది చిత్రయూనిట్. కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా “చావు కబురు చల్లగా” టీజర్ ను ఇటీవల విడుదల చేసారు. ఈ సినిమాలో శవాలను శ్మశానానికి తీసుకెళ్లే వ్యక్తిగా కార్తికేయ కనిపించనున్నాడు. ‘చావు కబురు చల్లగా’లో ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్, భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. అందాల భామ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్‌లు, టీజర్, పాటలు అన్నీ కూడా సినిమాపై అంచనాలను అంతకు అంతా పెంచాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో పాట విడుదలకు సిద్దమయింది. ‘కదిలే కాలాన్నడిగా’ అంటూ సాగే పాట ఈనెల 23న సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు విడుదల కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో హీరో, హీరోయిన్‌లు ఇద్దరు కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమాలో లావణ్య త్రిపాఠీ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కౌషిక్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పిస్తుండగా బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇందులో బుల్లితెర బ్యూటీ అనసూయ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా మార్చి19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts