telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మళ్ళీ లాక్ డౌన్ విధించిన దేశాలు ఇవే..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. కొన్ని దేశాలు కరోనా తాకిడికి లాక్‌ డౌన్ ‌ను తిరిగి ప్రారంభించాయి. ఫ్రాన్స్, జర్మనీలలో కరోనా కేసులు మళ్లీ పెరగడం మొదలైంది. చలికాలంలో కరోనా మరింత బలపడే అవకాశం ఉందని ముందుగానే అన్ని దేశాలు ఆలోచించిన విషయం తెలిసిందే. అయితే ఫ్రాన్స్, జర్మనీలలో చలికాలం ముందుగానే కరోనా కేసులు మళ్లీ తీవ్రంగా పెరగడంతో కరోనా రెండో విడత విజృంభనగా భావించిన ఆయా దేశ ప్రభుత్వాలు తిరిగి లాక్‌డౌన్‌ను ప్రారంభించాయి. ఈ విషయాన్ని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రోన్‌, జర్మన్ చాన్సెలర్ ఏంజెలా మార్కెల్ వారి దేశాలలో ప్రకటించారు. కరోనా ఎంతో వేగంగా అల్లుకుంటుందని, దానిని ఎవ్వరూ ఊహించలేకపోయారని మాక్రొన్ అన్నారు. కాబట్టి దానిని నివారించేందుకు మనం మళ్లీ లాక్‌డౌన్‌ను పాటించాలి. కరోనా నుంచి తప్పించుకునేందుకు లాక్‌డౌన్ ఓ మంచి పరిష్కార’మని మాక్రోన్ తెలిపారు. 

అయితే ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని, కుదిరితే వర్క్ ఫ్రం హోమ్ చేయాలనీ, కేవలం అత్యవసర, నిత్యవసర వస్తువులకు మాత్రమే బయటకు రావాలని ఫ్రాన్స్ ప్రజలను మాక్రోన్ కోరారు. అంతేకాకుండా రోజులో ఒక గంటసేపు వ్యాయామం కొరకు బయటకు రావచ్చని, బయటకు వచ్చినప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంటు దగ్గర ఉంచుకోవాలనీ టీవీల ద్వారా తెలిపారు. దేశంలో లాక్‌డౌన్ 30 రోజులు కొనసాగుతుందని చెప్పారు. అయితే ఫ్రాన్స్‌లో స్కూళ్లు తెరిచే ఉంటాయని అన్నారు. ఇక జర్మనీ యూరప్ దేశాలలో కరోనా కారణంగా తక్కువ దెబ్బతిన్న దేశంగా జర్మనీను చెప్పుకొవచ్చు. అయితే కరోనా రెండో విడత నుంచి తప్పించుకునేందుకు కాస్త ముందుగానే చర్యలు చేపట్టాలనీ మార్కెల్ అన్నారు. జర్మనీలో నవంబర్ 2 నుంచి 30 వరకూ లాక్‌డౌన్‌లో భాగంగా అన్నీ మూసివేయాలనీ, కానీ వాటి నుంచి స్కూళ్లు, మార్కెట్‌లను మినహాయించినట్లు మార్కెల్ తెలిపారు. ‘ప్రస్తుతం మనం ఈ ఛాలెంజ్‌ను ఎదుర్కోగలం. కానీ అతితక్కువ సమయంలోనే కరోనా దాని పరిదిని పెంచుకోగలదు. ముందుగా చర్య తీసుకుంటే అడ్డుకోవడం మరింత సులభతరం అవుతుంద’ని తెలిపారు.

Related posts