telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆండ్రియా ‘నో ఎంట్రీ’… ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విజయ్ ఆంటోనీ

No-Entry

ప్రముఖ తమిళ నటి ఆండ్రియా జెరీమియా. ‘గృహం’, ‘విశ్వరూపం 2’ సినిమాల్లో రొమాంటిక్ డోస్ కాస్త ఎక్కువగా ఉన్న సన్నివేశాల్లో నటించారు ఆండ్రియా. ఇటీవల రిలీజ్ అయిన ‘వడా చెన్నై’ సినిమాలో కూడా ఆండ్రియా పాత్ర బెడ్‌రూం సీన్లకే పరిమితం అయిపోయింది. అయితే మంచి పాత్రలతో తన వద్దకు వస్తే రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికైనా సిద్ధంగా ఉన్నానని ఇటీవల పేర్కొన్నారు. ప్రస్తుతం ఆండ్రియా దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘మాస్టర్’ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన టైటిల్‌, ఫస్ట్ లుక్‌ను మల్టీ టాలెంటెడ్‌ నటుడు విజయ్‌ ఆంటోని సోమవారం విడుదల చేశారు. ‘నో ఎంట్రీ’ అనే టైటిల్‌తో ఆండ్రియా త్వరలోనే రాబోతోంది. “ఆండ్రియా జెరెమియా తదుపరి చిత్ర టైటిల్ ‘నో ఎంట్రీ’ని రివీల్‌ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జుంబో సినిమాస్‌, ఇంకా నిర్మాతలకు శుభాకాంక్షలు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను..” అని విజయ్‌ ఆంటోని తెలిపారు. ఇక ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ విషయానికి వస్తే చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక అడవిని చూపిస్తూ, బ్యాక్ గ్రౌండ్‌లో డాగ్‌ని చూపిస్తూ, ఆండ్రియా భయపడుతూ, అడవిలోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా ఈ లుక్‌ ఉంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Related posts